calender_icon.png 12 August, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ బిఎ, బి.ఎడ్ లో స్పాట్ ప్రవేశాలకు అవకాశం

07-08-2025 06:12:47 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట(Government Degree College Lakshettipet)లో నాలుగేళ్ల  సమీకృత(ఇంటిగ్రేటెడ్) బి.ఏ. బి. ఎడ్. కోర్సులో ప్రవేశాల కొసం స్పాట్ అడ్మిషన్ చేబడుతున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డా సంతోష్ మహాత్మా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఎన్టిఏ-2025 హాజరై ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఎవరైనా 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేటలో బి.ఏ బి.ఈడి ప్రవేశం కోసం ఆగస్ట్ 8వ తేదీన మధ్యహ్నం ఒంటి గంట లోపు కళాశాల వెబ్ సైట్ లో పెట్టిన గూగుల్ ఫామ్ ద్వార దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి అదే రోజు సాయంత్రం ఎంపికైన విద్యార్థుల జాబితా కాలేజీ వెబ్ సైట్ లో ప్రకటించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 97032 67391 ఫోన్ నెంబర్ లో ప్రిన్సిపాల్ గారిని  మరియు ఐ.టి.ఏ.పి. కో ఆర్డినేటర్ 99128 52567 ఫోన్ నెంబర్ లో సంప్రదించ గలరు. ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.