14-10-2025 02:39:29 PM
జీవో.9కి రాజ్యాంగబద్ధత ఉంది: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: బీసీ సంఘాల నేతలు మంగళవారం నాడు తెలంగాణ జన సమితి(Telangana Jana Samithi) కార్యాలయానికి వెళ్లారు. బీసీ సంఘాల నేతలు ఈ నెల 18న నిర్వహించే బీసీ బంద్(BC Bandh) కు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చి నోటికాడి ముద్దను లాక్కుందని ద్వజమెత్తారు. పల్లెల్లో బీసీలు తిరుగుతున్నారు. పేద కులాల వారు అన్యాయాన్ని భరించారు. జీవో.9కి రాజ్యాంగబద్ధత ఉందని ఆర్ కృష్ణయ్య(MP R Krishnaiah ) అన్నారు. జనాభా లెక్కల ద్వారా రిజర్వేషన్లు ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లు(BC Reservations) దయా దాక్షిణ్యం మీద ఇచ్చేది కాదని, బీసీ రిజర్వేషన్లు అనేవి హక్క అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొపెసర్ కోదండరాం(Telangana Jana Samithi President Professor Kodandaram) అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు చేస్తామని రాష్ట్ర జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ. పీఎల్. విశ్వేశ్వర్ రావు తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేస్తామని సూచించారు. 16న గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. కోదండరాం మద్దుతుతో 18న నిర్వహించే బంద్ వంద శాతం సక్సెస్ చేస్తామని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) జాతీయ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కోదండరాం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలోని రెండున్నర కోట్ల బీసీల హక్కుల కోసం చేస్తున్న బంద్.. బీసీ బంద్ అన్నారు.