14-10-2025 02:23:45 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో చోరీ జరిగిన సంఘటన ఉప్పర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద తొర్రూర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రాజధాని బస్సులో డ్రైవర్ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని అగాంతకులు బస్సులోకి చొరబడి నిద్రిస్తున్న డ్రైవర్ల నగదు బ్యాగులు సెల్ఫోన్లు దొంగలించారు. ఈ ఘటనపై బాధితులు ఉప్పల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.