calender_icon.png 14 October, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతమడకలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం

14-10-2025 04:26:23 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక ఎం.జే.పీ.టి.బి.సి.ఆర్.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థినులకు మహిళల రక్షణ చట్టాలు, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, రూరల్ ఎస్ఐ రాజేష్, షీటీమ్ బృందం పాల్గొన్నారు. 

ఇన్స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ మహిళలు, బాలికలు నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్ QR కోడ్, డయల్-100, 112, 1098 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 8712667343 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో మమేకం కాకూడదని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మాధవి, ఏఎస్ఐ కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.