ఖమ్మంలో పలువురికి ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఖమ్మం,(విజయక్రాంతి): ఇటీవల కాలంలో ఖమ్మం నగరంలో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పరామర్శించారు. దంసలాపురం లోని అగ్రహారంలో నివాసం ఉండే ఆళ్ల వెంకటరెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తనయులు శేష వర్ధన్ రెడ్డి, అంజిరెడ్డి, అల్లుళ్లు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సత్య వర్ధన్ రెడ్డిలను ఓదార్చి, సానుభూతి తెలిపారు. అనంతరం శ్రీరామ్ హిల్స్ లో నివాసముండే కమర్తపు బతుకమ్మ కొద్ది రోజుల క్రితం చనిపోగా ఆమె తనయులు కమర్తపు మురళి, రవిందర్, కుటుంబ సభ్యులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ కూరపాటి ప్రదీప్ లను ఓదార్చి, సానుభూతి తెలిపారు.
అనంతరం మధిరలో నివాసముండే తన సమీప బంధువు ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయ్) ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుమారులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమాల్లో ఎంపీ రవిచంద్ర వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేటర్లు సాగర్, గుణ చరిత్, మహేష్ తదితరులు ఉన్నారు.






