12 May, 2026 | 6:20 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర

24-04-2026 05:40 PM

ఖమ్మం,(విజయక్రాంతి): తన‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం నుంచి మంజూరైన  సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పంపిణీ చేశారు. ఈ మేరకు ఖమ్మం బుర్హాన్ పురంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ. 8.50 లక్షల విలువైన చెక్కులను 19 మంది బాధితులకు అందజేశారు. మరో ఇద్దరికి ముందస్తు ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న బాదితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.