ఎంపీ తేజస్వి సభ్యత్వం రద్దుచేయాలి
ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి
తెలంగాణపై హేళనగా మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు ఏంచేస్తున్నారు?
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్‌చేశారు. తెలంగాణపై అ వహేళనగా మాట్లాడిన తేజస్వి సూర్య పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేయాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. తేజస్వి మాటలు పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలన్నారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభలో పాస్‌చేసిన బిల్లులను అవమానపరు స్తుంటే.. తెలంగాణకు చెందిన 8 మంది బీజే పీ ఎంపీలు చీము, నెత్తురు లేకుండా ఉన్నారని మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలు విం టూ ఎంజాయ్ చేసే దౌర్భాగ్య పరిస్థితిలో బీజేపీ ఎంపీలు ఉన్నారని, తెలంగాణ తల్లి రోదించే పరిస్థితి వచ్చిందన్నారు.
సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తే, ఇప్పు డు ప్రధాని మోదీ మొదలు మొన్న టీడీపీ ఆంధ్రా ఎంపీతో పాటు బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజన తరువాత ఎవరి బతుకులు వాళ్లు బతకాలనుకుంటే.. జ్ఞానం లేకుండా అజ్ఞానంతో పార్లమెంట్ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచేలా బీజేపీ ఎంపీ తేజస్వి మాట్లా డిన మాటలు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవమని దుయ్యబట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌తోపాటు మిగతా బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా స్పందించకుంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసినవా రిగా మిగులుతారని విమర్శించారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా కిషన్‌రెడ్డి పారిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు వెంటనే స్పందించాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం అప్రజాస్వామికమేనని, ఇది బీజేపీ విధానమన్నారు. తెలంగాణపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు వివరిస్తామన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ.. మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.






