ఇక మయూరి ఎకోపార్క్ ప్లాస్టిక్ రహితం
మహబూబ్ నగర్ రూరల్, మే 31 : మయూరి ఎకో పార్క్ పరిసర ప్రాంతాలలో విస్తృత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్క్ సిబ్బంది పరిసర ప్రాంతాలలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మయూ రి ఎకో పార్క్లో ఎటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని,
వాటిని ఉల్లంఘించే వ్యక్తులపై సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సందర్శకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు మయూరి ఎకో పార్క్లో డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందర్శకులు మీ టికెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని పార్క్ ప్రవేశ టికెట్లు, ఇతర అందుబాటులో ఉన్న టికెట్లను ఆన్లైన్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత పార్క్ నిర్మాణంలో ప్రతి సందర్శకుడు భాగస్వామి కావాలని, పరిశుభ్రమైన హరిత వాతావరణ పరిరక్షణకు సహకరించాలని అధికారులు కోరారు.






