14 July, 2026 | 4:08 AM

విద్యార్థులకు మాత్రల పంపిణీ

14-07-2026 01:34 AM

మొయినాబాద్, జూలై 13 (విజయ క్రాం తి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని (నేషనల్ డీవార్మింగ్ డే) నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు డీ వార్మింగ్ మాత్రలను పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొయి నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి షా బాద్ సోనియా దర్శన్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు నులిపురుగుల నివారణ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

పి ల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రా ణించగలరని, ప్రభుత్వం అందిస్తున్న ఇలాం టి ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స ద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మ న్ గరుగు రాజు, స్థానిక కౌన్సిలర్లు, పాఠశాల సిబ్బంది, మొయినాబాద్ పీహెచ్సీ వైద్య బృ ందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.