ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో
అయిజ ఏప్రిల్ 8 : అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి గుంతలు పడిన చోట మట్టి బాగా వేసి రోడ్డు సమతలంగా ఉండేలా చూడాలన్నారు.
ముఖ గుర్తింపు యాప్ ను మరియు హాజరు పట్టికను పరిశీలించిచారు. అనంతరం నర్సరిని పరిశీలించి ఎండలు ముదురుతున్నందువల్ల మొక్కలు వాడిపోకుండా గా నర్సరీకి ఎప్పటికప్పుడు నీళ్లు పట్టాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు భోజన సమయంలో నీడ ఉండేలా చూసుకోవాలని వారికి త్రాగునీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల హాజరు పట్టికలో ఎటువంటి అవకతవకలు జరిగిన సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.




