9 May, 2026 | 1:49 AM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

09-05-2026 12:39 AM

నాగిరెడ్డిపేట్,మే 8 (విజయ క్రాంతి):మండలంలోని వదల్పర్తి గ్రామంలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.పనుల నిర్వహణ తీరు,కూలీల హాజరు,సౌకర్యాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... జాబ్ కార్డులు కలిగిన ప్రతి కూలీ ఉపాధి పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫీల్ అసిస్టెంట్ కొరుపతి నర్సింలుకు సూచించారు.ప్రస్తుత ఎండల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూలీలకు ఎండదెబ్బ తగలకుండా తాగునీరు,విశ్రాంతి వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.ఈ పరిశీలనలో ఉపాధి హామీ సిబ్బంది,గ్రామ కూలీలు పాల్గొన్నారు.