చిన్నారులకు 'తొలిముద్ద'.. అల్పాహారాన్ని పరిశీలించిన ఎంపీడీవో
25-07-2026 03:58 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తొలిముద్ద' ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని శనివారం ఎంపీడీవో జమలారెడ్డి పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత, మెనూ అమలు తీరును పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదం వెంకటేశ్వరరెడ్డి, ఏపీఓ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ పున్నారెడ్డి, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'తొలిముద్ద' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని అధికారులు పేర్కొన్నారు.






