25 July, 2026 | 5:23 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

26న దోస్త్ రిజిస్ట్రేషన్‌కు ముగింపు

25-07-2026 04:17 PM

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం

కేసముద్రం,(విజయక్రాంతి): కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్ట్ (DOST) ప్రత్యేక విడత కౌన్సిలింగ్‌లో ఈనెల 26వ తేదీతో రిజిస్ట్రేషన్ గడువు ముగియనుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈనెల 26వ తేదీలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ (బీజెడ్‌సీ), బీఎస్సీ (ఎంపీసీఎస్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఇతర కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా వెబ్ ఆప్షన్ల ద్వారా కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. చివరి తేదీ కోసం వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు కోరారు.