తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
ఐబి రోడ్ లో కొత్త బోర్ మోటర్ ప్రారంభం
గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు.మండల కేంద్రంలోని ఐబి రోడ్ (చెరువాయ) సమీపంలో గత కొన్ని రోజులుగా బోర్ మరమ్మత్తుల కారణంగా ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని, తక్షణమే చర్యలు చేపట్టి కొత్త బోర్ మోటర్‌ను ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కట్కూరి రాధిక, భూపాలపల్లి మార్కెట్ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్ కలిసి బోర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలకు మళ్లీ తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. నీటి సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఐబి రోడ్ ప్రజలు సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుగ్యాల దేవేందర్ రావు, దూలం కుమారస్వామి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పొతర్ల అశోక్ యాదవ్, గుర్రం తిరుపతి గౌడ్, బూర రాజగోపాల్ గౌడ్, బూర పెద్ద నరసయ్య గౌడ్, పాలకుర్తి శాంతయ్య, గుర్రం నరసింహ స్వామి, మాదాసు అర్జున్, పల్లె మల్లేష్, శేషు, ఆనంద్, రాజేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.






