25 July, 2026 | 5:33 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్

25-07-2026 04:31 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వాగతం పలికారు. పూల మొక్కను అందజేసి న్యాయమూర్తులను అభినందించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో శని, ఆది, రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవీ లతలకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. న్యాయమూర్తులకు స్థానిక పోలీసులు ఆర్ అండ్ బి అతిథి గృహంలో పోలీస్ గౌరవ  వందనాన్ని చేశారు.