25 July, 2026 | 5:00 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

శోభయాత్రలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే

25-07-2026 04:22 PM

భైంసా (విజయక్రాంతి): తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసా పట్టణంలో(Bhainsa town) శనివారం భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురాణబజార్‌ లోని మార్వాడి భవన్ నుంచి విఠలేశ్వరుని పల్లకీ శోభాయాత్రను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఠల–రుక్మిణి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. చిన్నారులు విఠల్, రుక్మిణి, భక్త తుకారం వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ.. వార్కరి సంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.