25 July, 2026 | 4:59 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

ఉచితంగా న్యూరో సేవలు

25-07-2026 04:23 PM

- మూడు రోజులపాటు ప్రత్యేక శిబిరం 

- సద్వినియోగం చేసుకోవాలని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం పిలుపు 

ములుగు,(విజయక్రాంతి): న్యూరో సమస్యలతో బాధపడుతున్న రోగులకు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్టి యాజమాన్యం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది మూడు రోజులపాటు ఉచితంగా శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్ ప్రముఖ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల ఆధ్వర్యంలో అత్యాధునిక పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు నరాలు, మెదడు, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట, వరంగల్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం శనివారం వెల్లడించింది.

ఈ క్యాంప్‌లో ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల రోగులను ప్రత్యక్షంగా పరీక్షించి, వ్యాధి తీవ్రతను అంచనా వేసి అవసరమైన చికిత్సపై సమగ్ర సలహాలు అందించనున్నారు. నిరంతర తలనొప్పి, మెదడు సంబంధిత సమస్యలు, పక్షవాతం, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మెడ నొప్పి, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు, నరాల బలహీనత, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ ప్రత్యేక క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. క్యాంప్ సందర్భంగా న్యూరో ప్రొఫైల్ రక్త పరీక్షలు కేవలం 1,000 కే అందించడం జరుగుతుందని యాజమాన్యం తెలిపారు.

అంతేకాకుండా సీటీ స్కాన్, ఎన్సిఎస్ స్కాన్, ఈఈజీ వంటి అత్యవసర నిర్ధారణ పరీక్షలు కూడా ప్రత్యేక రాయితీ కింద వెయ్యి రూపాయలకే నిర్వహించబడతాయి. వెన్నుపూస శస్త్రచికిత్సల పై 20 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ క్యాంప్ ఈనెల 27 నుండి 29 వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించబడుతుంది. నరాల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రజలు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకుని ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.అపాయింట్‌మెంట్, వివరాలకు ఈ ఫోన్ నెంబరు సంప్రదించాలని 9459875555 యాజమాన్యం కోరింది.