16 May, 2026 | 3:13 PM

వంద దినాల పనిని సద్వినియోగం చేసుకోండి

16-05-2026 02:41 PM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ కార్యక్రమంలో పనిచేసే కూలీలు 100 రోజుల పని దినాలను పూర్తయ్యేంతవరకు వినియోగించుకోవాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కోరారు. శనివారం మండలంలోని రఘునాథపూర్ గండిపల్లి నారాయణపూర్ గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 8వ తేదీ వరకు కూలీలకు వేతనాలు మంజూరయ్యాయని తెలిపారు.

అంతేగాక ఆయా గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి జూన్ రెండవ తేదీ లోపు ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చూసుకోవాలన్నారు. అంతేగాక ఆయా గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించడం జరిగింది. పశువులకు త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శిలకు సూచించారు. అనంతరం దన్నూర్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ పృథ్వీరాజ్ పంచాయతీ కార్యదర్శి సీతారాం టి ఏ నరేష్ ఫీల్డ్ అసిస్టెంట్ దూదిరాం మెట్లు పాల్గొన్నారు