3 July, 2026 | 8:43 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి

06-03-2026 04:13 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి) గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ను వాడకం తగ్గించాలని ఎంపీడీవో రాథోడ్ రాధ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకు కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ చందా మండల కేంద్రంతో పాటు నర్సాపూర్ డబ్ల్యు కనకాపూర్  తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాల్లో పారిశుద్ధ్యప్పరులు నిరంతరం జరగాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పొడి చెత్త తడి చెత్త వేరు చేసే ట్రాక్టర్లకు అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే లక్ష్మణ్ చందా మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ చంద్ సర్పంచ్ ఓస కవిత రాజు నర్సాపూర్ డబ్ల్యూ సర్పంచ్ మల్లేష్ యాదవ్ కనకాపూర్ సర్పంచ్ సింగం రాజ్యలక్ష్మి వెంకటరాజ్ మండల పంచాయతీ అధికారి నసీరుద్దీన్ గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల వార్డు సభ్యులు యూత్ సభ్యులు ప్రజలు వీడిసి సభ్యులు పాల్గొన్నారు.