3 July, 2026 | 9:40 PM

Breaking News

ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •  

రాష్ట్రస్థాయి పోటీలకు బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులు

06-03-2026 04:08 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ) పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 14 సాఫ్ట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. ఎస్జీఎఫ్ జోనల్ లెవెల్ పోటీలు బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో డిసెంబర్ 9 నిర్వహించినట్లు తెలిపారు.

ఈ పోటీలలో మంచిర్యాల జిల్లా తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. మహబూబాద్ పట్టణంలోని సాక్రీడ్ హాట్ హై స్కూల్ నీలికొండలో ఈనెల7 తారీఖు నుంచి 9 వ తారీకు వరకు రాష్ట్రస్థాయి అండర్ 14 సాఫ్ట్బాల్ పోటీలు విద్యార్థులు పాల్గొంటారనీ  తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు డి.విశ్వతేజ, పి. రిసేంద్ర వర్మ, జి సుశాంత్, ఏ . శ్రీ హర్షవర్ధన్, ఎస్, సంకిత్ సాయి, డి. చైతన్య ఎస్. విజయ్ చంద్ర, ఎంపికయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ విజయ సాగర్, వైసీ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, సీనియర్ అధ్యాపకులు దశరథం, కొండలరావు అభినందించారు. మంచిర్యాల డీసీఓ రమా కళ్యాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులకు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు.