9 May, 2026 | 12:04 AM

బీజేపీలో చేరిన ఎంపీపీలు

26-04-2024 12:10 AM

నారాయణఖేడ్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మనూరు మండల ఎంపీపీ కొంగరి జయశ్రీమోహన్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాములు, నాగల్‌గిద్ద మండల ఎంపీపీ ఉపాధ్యక్షుడు పండరియాదవ్ గురువారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్,  బీజేపీ రాష్ట్ర నాయకుల ఆలె భాస్కర్‌రాజ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరితో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎంపీటీసీలు, సర్పంచు లు, వార్డు సభ్యులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరిఅంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణా, నాగల్‌గిద్ద జడ్పీటీసీ రాజురాథోడ్ ఉన్నారు.