3 April, 2026 | 2:53 AM

మాట నిలబెట్టుకున్న ముడిమ్యాల సర్పంచ్

03-04-2026 01:30 AM

ఆడబిడ్డలకు రూ.21 వేలు, మగ పిల్లలకు రూ.11వేలు అందజేత

చేవెళ్ళ ఏప్రిల్ 2 (విజయక్రాంతి): చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామ సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోనె జంగారెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో తాము గెలిస్తే గ్రామంలో  ఆడపిల్లలు పుడితే రూ.21 వేలు, మగపిల్లలు పుడితే రూ.11 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం గురువారం గ్రామంలో ఎంపీడీవో హిమబింధు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడబిడ్డల తల్లిదండ్రులకు నగదు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానం చేయడమే కాదు.. సొంత డబ్బు ప్రజలకు పంచి నిలబెట్టుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. గ్రామంలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలు పరిష్కరించామని చెప్పారు. గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే కాదు.. బిల్లులు కూడా క్లియర్ చేశామని వెల్లడించారు.  ఏమైనా సమస్యలు ఉంటే పాలకవర్గం, అధికారుల దష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఏసీపీ కిషన్ మాట్లాడుతూ... గ్రామంలో పిల్లలందరినీ చదివించాలని,  తాను చదువుకున్నాను గనుకే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం మాజీ  అధ్యక్షుడు పడాల ప్రభాకర్, సీనియర్ నేతలు గోనె శ్రీనివాస్ రెడ్డి, హరికిషన్ రెడ్డి,  సూర్యపేట శ్రీనివాస్ గౌడ్,  పడాల మహేందర్, ఆరీఫ్ మియా,  వాజిద్, దినేశ్ రెడ్డి, విశాల్ రెడ్డి, మల్గని శంకర్ గౌడ్, జూకంటి అంజయ్య,  వార్డు మెంబర్లు  ఊరడి రజిత సత్తయ్య, మహేందర్, అశోక్, కౌసర్ బీ,  సెక్రటరీ షమీమ్ సుల్తానా, వీవోఏ యంజాల వినోద్, నేతలు చాకలి గోపి, పీ. లక్ష్మయ్య, హైమద్, హనీఫ్ మియా, సూద రాము, మల్గని మహేందర్ , హర్ష వర్దన్, హఫీజ్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.