ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రగతి ప్రణాళిక
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘవ ఏదైనా తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ. 10,11 వార్డుల్లో ‘ ప్రజా పాలన - ప్రగతి పాలన‘ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ‘వార్డు సభ‘ కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఆమె ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ నరసింహ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




