6 April, 2026 | 8:30 PM

ముదిరాజ్ సామాజిక వర్గం రాజకీయంగా రాణించాలి

06-04-2026 06:58 PM

ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి వితరణ

జవహర్ నగర్,(విజయక్రాంతి): ముదిరాజ్ సామాజిక వర్గం రాజకీయంగా రాణించాలని సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనిల్ కుమార్ ముదిరాజ్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ కు చెందిన అరికెల అనిల్ కుమార్ ముదిరాజ్  సోమవారం రూ. 1,00,116( లక్ష నూట పదహారు రూపాయలు) వితరణ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ యాదగిరిగుట్టలో నిర్మాణం చేస్తున్న ముదిరాజ్ సంఘం భవనానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులకు చెక్కును అందజేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అనిల్ కుమార్ కు ఎల్లప్పుడూ ఉండాలని సొసైటీ సభ్యులు ఆకాంక్షించారు.