11 July, 2026 | 1:51 AM

ఫీజు బకాయిలను తక్షణం చెల్లించాలి

11-07-2026 12:00 AM
  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
  2. సీఎస్‌తో బీసీల డిమాండ్లపై చర్చలు

ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులు, బీసీ ప్రజల డిమాండ్లపై శుక్రవారం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుతో బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ సంఘ నాయకులు చర్చలు జరిపారు. 14 లక్షల మంది కాలేజీ విద్యార్థు ల ఫీజుల బకాయలు 8వేల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.

అదనంగా 120 బీసీ కాలేజీ హాస్టళ్లు, 30 ఎస్టీ హాస్టళ్ళు మంజూరు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న హాస్టళ్లలో 20 శాతం సీట్లు పెంచాలని కోరారు. 150 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. బీసీ రెసిడె న్షియల్ పాఠశాలలో 99 శాతం రిజల్ట్ రావడంతో డిమాండ్ బాగా ఉన్నందున అద నంగా10 శాతం సీట్లు పెంచాలన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా రెగ్యులర్‌గా సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు.

ఉద్యోగాల భర్తీకే అమలు చేస్తున్న రోస్టర్ విధానం బీసీలకు అన్యా యం చేసే విధంగా ఉందన్నారు. దీనిపై సమీక్ష చేసి మార్చాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30వేల టీచర్ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్--1 1,600 పోస్టులు, గ్రూప్ -2లో 3వేల పోస్టులు, గ్రూప్- 4 లో 10వేల పోస్టులు భర్తీ చేయాలన్నారు. సీఎస్ స్పందించి డిమాండ్లను పరిష్కరిస్తామని హా మీ ఇచ్చారు.

ఈ చర్చలలో రాష్ట బీసీస సంక్షే మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షు లు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ విద్యార్థి సం ఘం పగిళ్ళ సతీష్ కుమార్, రాష్ట బిసి సంఘం అధ్యక్షుడు సి రాజేందర్, ఐక్య కులా ల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జి అనంతయ్య, రాష్ట్ర బిసి విద్యార్ధి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్, రాష్ట్ర బిసి ప్రజా సమితి అధ్యక్షులు భీంరాజు, గుజ్జ కృష్ణ  పాల్గొన్నారు.