27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పుణ్యఫలం

30-12-2025 03:20 PM

మంథని,(విజయక్రాంతి): ఈ ఏడాది చివర మంగళవారం పుష్య మాసంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మంథని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని పునీతులయ్యారు

 ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత:

ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే  అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ఉత్తర దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము ఆక్సిల్ అంటారు. ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు.

ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి.  వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం ధర్మము.

కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్ధుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉంది.