calender_icon.png 30 December, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారుడు గట్టయ్య కన్నాల సర్పంచ్‌గా ఎన్నికవ్వడం చాలా సంతోషం

30-12-2025 03:26:04 PM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయుఎఫ్) నాయకులు

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు గుడిసె గట్టయ్య కన్నాల సర్పంచ్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయుఎఫ్)   నాయకులు అన్నారు. మంగళవారం వారు తెలంగాణ ఉద్యమకారుడు గుడిసె గట్టయ్య  కన్నాల సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయుఎఫ్)  నాయకులు  మాట్లాడుతూ గట్టయ్య సర్పంచ్ గా కన్నాల గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చేలా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు  దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుడిసె గట్టయ్య  మాట్లాడుతూ ఉద్యమకారులందరూ నన్ను సన్మానించడం చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమకారులందరి తరపున నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఉద్యమకారులకు రావాల్సిన ఉద్యమ ఫలాలను వచ్చే విధంగా ఉద్యమకారులందరినీ మంత్రి దగ్గరకు తీసుకువెళ్లి నెరవేర్చే విధంగా కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయకుమార్, నియోజకవర్గ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి జాడి జంపన్న, వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, ఉద్యమ కారుడు తాటి బుచ్చయ్య గౌడ్, మంథని విద్యార్థి యువత అధ్యక్షులు  కొండేల మారుతి, బిజెపి నాయకుడు నార మల్ల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.