20 June, 2026 | 2:40 AM

మహిళ సాధికారతకు ముల్కనూర్ మహిళా డైరీ కృషి

20-06-2026 12:37 AM

సహకార రంగ నిపుణులు డా. ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్

భీమదేవరపల్లి, జూన్ 19 (విజయ క్రాంతి) గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు ముల్కనూర్ మహిళా డెయిరీ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. డెయిరీ అభివృద్ధి, విస్తరణ మహిళా సభ్యుల సంక్షేమం కోసం మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి అందిస్తు న్న దూరదృష్టి నాయకత్వం, అంకితభావం మరియు నిరంతర కృషిని డా. శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సంస్థ సిబ్బంది సభ్యులు నిబద్ధతతో అందిస్తున్న సేవలు డెయిరీ విజయానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.

సహకార స్ఫూర్తితో మహిళల ఆదాయ వృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధికి ఈ సంస్థ విశిష్ట సేవలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో శిక్షణ, డాక్యుమెంటేషన్, సామర్థ్య వృద్ధి మరియు సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంస్థ పురోగతి రెండు తెలుగు రాష్ట్రాలకి గర్వ కారణం అని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.