కేఎంసీలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ప్రారంభం
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
హనుమకొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో వరంగల్ వైద్య హబ్ గా రూపుదిద్దుకుంటోందని, అన్ని రకాల సేవలతో ప్రత్యేకంగా నిలుస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) అన్నారు. శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(Multidisciplinary Research Unit)ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy)తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైద్య విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితమవకుండా.. పరిశోధనలపై దృష్టిసారించేందుకు ఈ యూనిట్ దోహదం చేస్తుందని తెలిపారు. యూనిట్ ద్వారా పరిశోధనలు చేపడితే వైద్యశాస్త్ర పురోగతి మరింత సుసాధ్యం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కేఎంసి ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.






