27 April, 2026 | 3:17 AM

కర్రే గుట్టల్లో ములుగు ఎస్పీ పర్యటన

27-04-2026 01:33 AM

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని కర్రె గుట్టల్లో అధికారులతో కలిసి ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యటించారు. మురుమూరు నుండి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మాణంలో ఉన్న రహదారి పనులను పరిశీలించారు.

రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. రహదారి నిర్మాణ పనుల నిమిత్తం రాత్రింబవళ్లు కష్టపడి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.  ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్, సివిల్ సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.