27 April, 2026 | 2:49 AM

జనగణనలో స్వీయ నమోదు ప్రారంభం

27-04-2026 01:31 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): జన గణన కార్యక్రమం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మే 10 వరకు జిల్లావ్యాప్తంగా తలపెట్టిన స్వీయ గణన కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పుర ప్రముఖులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ స్వీయ జన గణన కార్యక్రమంలో పాల్గొని సంబంధిత వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, తన స్వయ జనగణన కార్యక్రమాన్ని నమోదు చేసుకున్నారు.

గణాంక అధికారి వారి ఇంటికి వెళ్లి వివరాలను స్వీకరించి నమోదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న జన గణన స్వీయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వివరాలను నమోదు చేసుకుని గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేయాలని, మున్సిపల్ పరిధిలోని అందరు కౌన్సిలర్లు విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, తహసిల్దార్ రాజేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.