20 June, 2026 | 2:38 AM

టాప్ ప్లేస్‌కు ముంబై డ్రీమర్స్

20-06-2026 12:00 AM

హైదరాబాద్, 19 జూన్ 2026 : రగ్బీ ప్రీ మియర్ లీగ్ పవర్డ్ బై అవిడ్ సీజన్ 2 నాలు గో రోజు ముంబై డ్రీమర్స్ అగ్రస్థానానికి చే రుకుంది. గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరుగుతున్న పోటీల్లో ముంబై డ్రీమర్స్, ఢిల్లీ రెరె డ్జ్‌ను ఓడించింది. పురుషుల మ్యాచ్‌లో ముంబై డ్రీమర్స్ 31-14తో ఢిల్లీ రెడ్జ్‌పై గెలు పొందింది. తొలి క్వార్టర్ హోరాహోరీగా సా గిన తర్వాత నీరజ్ ఖత్రి ట్రైతో ముంబై డ్రీమ ర్స్ ఖాతా తెరిచింది.  రెండో క్వార్టర్లో ఢిల్లీ రెడ్జ్ అద్భుతమైన పాసింగ్ ప్రదర్శిస్తూ జోసెఫ్ సె ర్రెస్ ద్వారా తమ తొలి ట్రై నమోదు చేసింది. విరామానికి ముందు గిలామ్ బూషే మరో ట్రై సాధించి ముంబై ఆధిక్యాన్ని మరింత పెంచగా, ప్యాట్రిక్ ఒడోంగో కౌంటర్ అటాకింగ్ ట్రైతో ఢిల్లీని పోటీలో నిలిపాడు.