4 వారాల్లో నివేదికలు సమర్పించండి
హెచ్‌సీఏ కేసులపై లోకాయుక్త కీలక ఆదేశాలు
టీజీ20 లీగ్‌పై హైకోర్టుకు టీసీఏ క్రికెటర్లు
లీగ్ ఆపాలని కోరుతూ రిట్ పిటిషన్
హైదరాబాద్, జూన్ 19: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. హెచ్ సీఏపై నమోదైన ఫిర్యాదులకు సంబంధించి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ లోకాయుక్త కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) దాఖలు చేసిన నాలుగు ఫిర్యాదులపై దర్యాప్తును పూర్తి చేసి, పూర్తి స్థాయి యాక్షన్ టేకన్ రిపోర్టులు, ప్రాసిక్యూషన్ నివేదికలు మరియు సంబంధిత రికార్డులు నాలుగు వారాల్లో సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. అదే సమయంలో FIR No. 02/2025 దర్యాప్తు ను కూడా నాలుగు వారాల్లో పూర్తి చేసి, చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
సీఐడీతో పాటు హెచ్‌సీఏ కూడా తమ చర్యలపై సమగ్ర నివేదికలను లోకాయుక్త ఎదుట దాఖలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్ప వని లోకాయుక్త హెచ్చరించింది. అనంతరం ఈ కేసును జూలై 24కు వాయిదా వేసింది. మరోవైపు టీజీ20 లీగ్ పై టీసీఏకు చెందిన క్రికెటర్లు గౌరవ్ శర్మ, మహేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హెచ్‌సీఏ ప్రతిపాదించిన టీజీ20 లీగ్‌కు చట్టబద్ధత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత పా లకవర్గానికి ఆ లీగ్ నిర్వహించే అధికారాన్నికూడా సవాల్ చేశారు. పిటిషనర్లు తమ రిట్ లో హెచ్‌సీఏ వివాదాస్పద పదవీకాలంలో జరిగిన నియామకాలు, అనుమతులు, పరిపాలనా నిర్ణయాలు, పాలనా ప్రక్రియలన్నిం టిపై న్యాయపరమైన విచారణ జరపాలని కోరారు. తుది తీర్పు వెలువడే వరకు టీజీ 20 నిర్వహణపై వెంటనే జోక్యం చేసుకోవాలని హైకోర్టును అభ్యర్థించారు.






