3 May, 2026 | 2:59 AM

చెన్నై చెడుగుడు

03-05-2026 01:05 AM

చిత్తుగా ఓడిన ముంబై

రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్

ముంబై కథ ముగిసినట్టే

కార్తీక్ శర్మ ౫4 నాటౌట్

౩ వికెట్లు తీసిన అన్షుల్

ఐపీఎల్ 2026లో ముంబై కథ ముగిసినట్టే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయాన్ని అందుకుంటే ఏడో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపుగా దూరమైంది. ముంబై మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.

చెన్నై, మే 2 : ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. స్లో ప్పి తొలుత బ్యాటింగ్ చేయడం ఆశ్చర్యంగా ఉందనే అభిప్రా యం వినిపించింది. దానిని నిజం చేస్తూ.. ఈ పిచ్‌పై పరుగులు చేసేందుకు ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. గత మ్యాచ్‌లో మెరుపు ఆరంభం ఇచ్చిన విల్ జాక్స్.. 5 బంతుల్లో 1 రన్ మాత్ర మే చేసి పెవిలియన్ చేరిపోయాడు. నమన్ ధీర్ 37 బంతుల్లో 57 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ర్యాన్ రికల్టన్ 24 బంతుల్లో 37 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. మంచి ఆరంభమే దక్కినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 12 బంతుల్లో 21 రన్స్ చేసి పెవిలియన్ చేరిపోయాడు. తిలక్ వర్మ (5), రాబిన్ మింజ్ (5) ఆకట్టుకోలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా సేపు క్రీజులో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేకపో యాడు. 23 బంతులు ఎదుర్కొన్న అత డు కేవలం 18 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో అనుకున్నదానికంటే ముంబై తక్కువ స్కోరుకే పరిమితమైంది. ముం బై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కాం బోజ్ అదరగొట్టాడు. 3 వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. డెబ్యూ ప్లేయర్ రామకృష్ణ ఘోష్ 1 వికెట్, జెమీ ఓవర్టన్ 1 వికెట్ తీశారు. జెమీ ఓవర్టన్ నాలు గు ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ముంబై తక్కువ స్కో రుకే పరిమితం కావడంలో కీలకపాత్ర పోషించాడు. ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ త్వ రగానే సంజూ శాంసన్ (11) వికెట్ కోల్పోయిం ది. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.

వీరిద్దరూ రెండో వికెట్ కు 22 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. ఉర్విల్ పటేల్ 12 బంతుల్లో 24 రన్స్ కు ఔటైనా కార్తీక్ శర్మతో కలిసి రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ముంబై బౌ లర్లపై ఆధిపత్యం కనబరిచారు. మూడో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో చెన్నై సూపర్ కిం గ్స్ 18.1 ఓవర్లలోనే టా ర్గెట్‌ను అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 67 (5 ఫోర్లు, 2 సిక్సర్లు), కార్తీక్ శర్మ 40 బం తుల్లో 54 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

స్కోరు బోర్డు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 159/7 (నమన్ ధీర్ 57, రికెల్టన్ 37, సూర్యకుమార్ 21, అన్షుల్ కాంబోజ్ 3/32, నూర్ అహ్మద్ 2/26)

చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : 160/2 ( రుతురాజ్ 67, కార్తీక్ శర్మ 54, ఉర్విల్ పటేల్ 24, బుమ్రా 1/20, ఘజన్‌ఫర్ 1/40)