ఇన్ఫెక్షన్లు, అంటు వ్యాధుల సంరక్షణపై సదస్సు
సికిందరాబాద్ యశోధ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, మే 2(విజయక్రాంతి): సికిందరాబాద్ యశోద హాస్పిటల్ తన ఇన్ఫెక్షస్ డిసీజెస్ విభాగం ఆధ్వర్యంలో క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ(సీఐడీఎస్), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజిస్ట్స్ (ఐఏఎంఎం), అసోసియేషన్ అఫ్ ఫిసీషియన్స్ అఫ్ ఇండియా (ఏపీఐ) హైదరాబాద్ చాప్టర్ వంటి ప్రముఖ వైద్య సంస్థలతో కలిసి ఇన్సీకాన్-2026 పేరుతో అంటు వ్యాధులు, క్లిష్ట మైన సంరక్షణ పై జాతీయ స్థాయి శాస్త్రీయ సదస్సును శనివారం హైటెక్ సిటీ, రాహేజా మైండ్స్పేస్ ఐటీ పార్క్ లోని ది వెస్టిన్ హోటల్‌లో ప్రారంభించారు.
500 మందికి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో శని,ఆదివారాల్లో జరగనున్న ఈ రెండు రోజుల జాతీయ సదస్సును యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ యశో ద హాస్పిటల్స్‌లో మేము అకాడమిక్ ఎక్సలెన్స్, నిరంతర వైద్య విద్యను ప్రోత్సహిం చడంపై కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఇన్సీకాన్-2026 ద్వారా మాలిక్యులర్, ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులు, వైద్య పరీక్షల విశ్లేషణ,నూతన చికిత్స విధానాలపై నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారన్నారు.ఈ సదస్సులో క్రిటికల్ కేర్, ఇన్ఫెక్షస్ డిసీజెస్, ట్రాపికల్ ఇన్ఫెక్షన్లు, ట్రాన్స్‌ప్లాంట్ సంబంధిత ఇన్ఫెక్షన్లు, క్లినికల్ మైక్రోబయాలజీ విశ్లేషణలు, హెచ్‌ఐవీ సహా రోగనిరోధక శక్తి తగ్గిన రోగు ల్లో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ చికిత్సలో ఇన్ఫెక్షన్లు, మాలిక్యులర్, ఆధునిక నిర్ధారణ పద్ధతులు, టీకాలు, నివారణ చర్యలు వంటి విభిన్న అంశాలు చర్చిస్తారన్నారు.
అలాగే, ప్రస్తుత క్లినికల్ సవాళ్లు ,అభివృద్ధి చెందుతున్న చికిత్స విధానాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. యశోద హాస్పిటల్స్- సికిం ద్రాబాద్, సీనియర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ మోనాలిసా సాహూ మాట్లాడుతూ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఆధునిక వైద్యంలో అత్యంత సవాలుతో కూడుకున్న,వేగంగా మారుతున్న వైద్య విభాగమని అన్నారు.
ఈ ఇన్సీకాన్-2026 సదస్సు ద్వారా ఐసీయూ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ వ్యాధులు, సెప్సిస్ నిర్వహణ, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, టీబీ, హెచ్‌ఐవీ నిర్వ హణలో తాజా మార్పులు, యాంటీమైక్రోబియల్ స్టీవర్డ్‌షిప్, పిల్లల ఇన్ఫెక్షస్ డిసీజెస్ అభి వృద్ధి చెందుతున్న చికిత్సా విధానాలు, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కేస్-బేస్డ్ డిస్కషన్స్, ప్యానెల్ చర్చల ద్వారా సదస్సులో పాల్గొన్న వైద్యులు క్లిష్టమైన ఇన్ఫెక్షన్లను, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లను ఎలా నిర్వహించాలో ప్రాక్టికల్ అవగాహన పొందారన్నారు.
ఈ సదస్సు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య, సికిందరాబాద్ యశోద హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. సదస్సుకు ప్రధాన సమన్వయకర్తగా సీనియర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ మోనాలిసా సాహూ వ్యవహరించారు.






