calender_icon.png 3 February, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌కు సన్మానం

03-02-2026 02:31:08 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 2(విజయ క్రాంతి): మేడారం సమ్మక్కసారక్క జాతర సందర్భంగా సిద్ధిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామానికి చెందిన శైలంద్ర సురేష్ అనే ప్రయాణికుడు తాడ్వాయి  మండలం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న నిజామాబాదు జిల్లా కు చెందిన ట్రాఫిక్ ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ : 1051 జి. దస్తయ్య  వెంటనే అప్రమత్తమై సీపీఆర్ (సి పి ఆర్) నిర్వహించారు. అనంతరం కమ్యూనికేషన్ సెట్ హాస్పిటల్ కు తరలించడం కోసం  సమాచారం అందించారు.   

అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్  ఎం. వినోద్  రెండు కిలోమీటర్ల దూరంలో గల అంబులెన్సు ను ట్రాఫిక్ రూట్ త్వరితగతిన మొత్తం క్లియర్ చేస్తూ అంబులెన్సు లో హుటాహుటిన ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వీరి సమయస్ఫూర్తి , మానవీయతతో చేసిన ప్రయత్నాల ఫలితంగా బాధితుడు శైలేంద్ర సురేష్ ప్రాణాలు నిలిచాయి.

అంకిత భావంతో ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తూ ఒక ప్రాణాన్ని రక్షించినందుకు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి. దస్తయ్య,రిజర్వ్ ఇన్స్పెక్టర్  ఎమ్. వినోద్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, తన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కారించి అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సాయి చైతన్య మాట్లాడుతూ ఇటువంటి సహయ చర్యలు పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నాయని, ప్రతి ఒక్కరూ హెడ్ కాన్స్టేబుల్ దస్తయ్య, రిజర్వు ఇన్స్పెక్టర్ వినోద్  సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పోలీస్ సిపి అభినంధించిచారు. ఈ సన్మాన కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ,  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  పి. ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు