6 July, 2026 | 3:56 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులు..

18-03-2025 05:31 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 2వ వార్డు పరిధిలో బీసీ కాలనీలో ఇటీవల నెలకొన్న తాగునీటి సమస్య (బోర్లు ఎత్తిపొస్తుండటం) పలువురు కాలనీ వాసులకు నీటి ఎద్దడి సమస్య ఏర్పడింది. ఈ తాగునీటి సమస్యను అలాగే కాలనిలో నెలకొన్న పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని ఇటీవల మున్సిపల్ కమిషనర్ మహేష్ ను కాలనీవాసులు కోరగా స్వయంగా బీసీ కాలనీలో పర్యటించిన కమిషనర్ మహేష్, మున్సిపల్ ఎ.ఇ. వినోద్ తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు మంగళవారం బోర్ ఎత్తిపోకుండా మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులకు నీటి సమస్యను పరిష్కరించిన అధికారులు రానున్న రోజుల్లో సైతం ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ ఏఈ వినోద్ లకు కృతజ్ఞతాలను తెలిపారు.