calender_icon.png 16 September, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవుల సంరక్షణ మనందరి భాద్యత

18-03-2025 05:28:27 PM

మందమర్రి (విజయక్రాంతి): అటవీ ప్రాంతాల సంరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు అటవీ చట్టాలపై అవగాహన పెంచుకొని అడవులను సంరక్షించుకోవాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (అవడం) సీ రేపతిరెడ్డి ఆన్నారు. మండలంలోని పొన్నారం గ్రామంలో మంగళవారం మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాలను పరిశీలించి ఉపాధి కూలీలకు అటవీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (A)(g) ప్రకారం అడవులను కాపాడుట, వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అడవులలో జరిగే అగ్ని ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరారు. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్నిప్రమాదం సంభావిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (మామిడిగట్టు) కే రమేష్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.