calender_icon.png 12 February, 2026 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్

12-02-2026 02:13:27 AM

  1. 77.64 శాతం ఓటింగ్ నమోదు 

బారులు తీరిన వీలీన గ్రామాల ఓటర్లు

బోగస్ ఓట్లు వేయిస్తూ పట్టుబడిన కాంగ్రెస్ కార్యకర్తలు

జిల్లా కేంద్రంలోని14, 15వ పోలింగ్ కేంద్రం వద్ద గడిబిడి

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 11 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ల్లో బుధవారం ఎన్నికల ప్రక్రియ చెదురు ముదురు ఘటనలు మినహా జిల్లా అంతటా ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీల్లో ని విలీన గ్రామాల ఓటర్లు ఉదయం 7 గం టల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు నమోదు కోసం బారులు తీరారు.

పట్టణంలోని ఆయా వార్డుల్లోని పోలింగ్ కేంద్రా ల్లో ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్ 14వ వార్డు, బాబు జగ్జీవన్ రావ్ భవన్ వద్ద 15వ వార్డులోబి పోలింగ్ కేం ద్రం వద్ద వృద్ధుల ఓటును ముసుగు వేసి యువతులతో బోగస్ ఓటింగ్ నమోదు అవుతుందని టిఆర్‌ఎస్ నేతలు గుర్తించారు. దీంతో కాంగ్రెస్ బిఆర్‌ఎస్ నేతల మధ్య కొం తసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.

విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మర్రి మాజీ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు వారిని నిలు వరిస్తూ చెదరగొట్టారు. జిల్లాలోని నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65 వార్డులకు గాను 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించామని కలెక్టర్ బాధవత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.

సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించడంతో పాటు వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా నిశితంగా పర్యవేక్షణ చెప్పారు. ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవస హాయం లతో కలిసి కలెక్టరేట్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించామని పేర్కొన్నారు. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఫోటోలతో కూడి న ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం, బీఎల్‌ఓల ద్వారా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు భారీగా తరలివచ్చారని తెలిపారు. 

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 80,757 మంది ఓటర్లకు గాను 62,703 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పురుషులు 40,028 మందికి గాను 31,046 మంది,మహిళలు 40,728 మంది కి గాను 31,657 మంది చొప్పున జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం  77.64 శాతం నమోదు అయ్యిందని తెలిపారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ

మొత్తం ఓటర్లు 35,378 మందిలో 26, 171మంది చొప్పున 73.98 శాతం ఓటు హ క్కు వినియోగించు కున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ

మొత్తం ఓటర్లు 26,023

ఓటు వేసిన వారు: 21,027

పోలింగ్ శాతం: 80.80 కాగా 

కొల్లాపూర్ మున్సిపాలిటీ

మొత్తం ఓటర్లు: 19,356

ఓటు వేసిన వారు: 15,505

పోలింగ్ శాతం: 80.10గా నమోదు అయ్యింది. జిల్లా కేంద్రం 17వ వార్డు లోని స్వతంత్ర అభ్యర్థి భర్త ప్రచారం నిర్వహించుకుంటూ తన ఓటు వినియోగించుకోవ డంలో వెనుకబడ్డారు. ఈ నెల 13న ఉద యం 8 గంటల నుంచి కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అపోహ లు, గొడవలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.