calender_icon.png 12 February, 2026 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత

12-02-2026 02:15:00 AM

జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్నగర్, టౌన్ ఫిబ్రవరి 11 : జిల్లా పరిధిలోని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మునిసిపాలిటీ, దేవరకద్ర మునిసిపాలిటీలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్ని కలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన భద్రతా చర్యలు చేపట్టింది.

జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షణలో ముందస్తు ప్రణాళికతో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు, ఫ్లాగ్ మార్చ్లు, మొబైల్ పట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఎన్నికలు నిర్భయ వాతావరణంలో నిర్వహించబడినవి. పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

అక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయాలని, 24 గంటల నిఘా, సీసీ కెమెరా పర్యవేక్షణ, నియమిత బందోబస్తు కొనసాగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోనే ఉంటుందని తెలిపారు.

ఈ సమయంలో ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలు, గందరగోళాలు లేదా సంఘ విద్రోహ కార్యకలాపాలకు తావు ఇవ్వబోమని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.