25-07-2025 01:36:21 AM
వరదలో చిక్కుకున్న 5 గురు ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో కాపాడిన అధికారులు
ఖమ్మం, జులై 24 (విజయ క్రాంతి ): వరసగా కురుస్తున్న వానతో మున్నేరు మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. కొన్ని దిగువ ప్రాంతాలు వరద నీటితో మునిగిపోతు న్నాయి. గురువారం ఒక్కసారిగా ప్రవహిం చిన నీటితో చింతకాని మండలం చిన్న మం డవ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. చిన్న మండల గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వారి గేదెలను మేపేందుకు లంకలోకి వెళ్లారు.
ఒక్క సారిగా వరద ఉధృతి దాల్చడంతో వారు వరద నీటిలో చిక్కుకున్నారు. గ్రామా నికి చెందిన గుండ్ల సాలయ్య, మొండితోక పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, దరెల్లి శ్రీను, కుక్కల గోపి లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో వారు కేకలు వేసి ఫోన్లు ద్వారా వారి బంధువులకు తెలియజేయ డంతో, వారు అధికారులకు విషయం తెలి పారు.
ఈ విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెంటనే వారిని కాపాడాల్సిందిగా అధికారులను ఆదే శించారు. దీంతో స్థానిక పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వారిని కాపాడి ఒడ్డుకి చేర్చారు. దీంతో అటు అధికారులు గ్రామ స్తులు ఊపిరి పీల్చుకున్నారు.
స్పందించి వారిని కాపాడినందుకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, స్థానిక పోలీసులకు, అధికారు లకు, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందికి గ్రామ ప్రజ లు కృతజ్ఞతలుతెలిపారు.