calender_icon.png 12 August, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశప్రజల మనుగడకు కమ్యూనిస్టులే దిక్చూచి

25-07-2025 01:37:59 AM

కూనంనేని సాంబశివరావు పట్టణంలో భారీ ర్యాలీ ఎరుపెక్కిన గూడెం వీధులు

భద్రాద్రికొత్తగూడెం, జూలై 24 (విజయ క్రాంతి)దేశప్రజల మనుగడుకు కమ్యూనిస్టులే దిక్చూచి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావుఅన్నారు. గురువా రం స్థానిక పద్మశాలి భవన్లో కొత్తగూడెం పట్టణ 27 మహాస భ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ సెంటర్ నుండి భజనమందిర్ వరకు ఐదువేల మందితో భా రీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మహిళలునృత్యాలతో అలరించారు. పట్టణంలోని అన్ని కార్మిక వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొత్తగూడెం వీధులన్నీ ఎర్రజెండాలతో రెపరెపలాడాయి. సభా ప్రాంగణం వద్ద అరుణ పతాకాన్ని కూనంనేని ఆవిష్కరించిన అనంతరం అమరులకునివాళ్లర్పించారు. మునిగడప వెంకటేశ్వర్లు, కంచర్ల జమలయ్య అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ ఈ ప్రాం తంతో 45 ఏళ్ల అనుబంధం ఉందని,

ఈ సుదీర్ఘ రాజకీయప్రస్థానంలో అనేక ఆటుపోట్లు చవిచూసి ప్రాణాలకు తెగించి పో రాటాలు నిర్వహించినట్లు తెలిపారు. కమ్యూనిస్టు ఐఖ్యబలం తో అనేక కాలనీలను నిర్మించామని, ఇప్పుడు ఆ కాలనీల్లో ప్ర జలు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారని చెప్పారు.

ఈ కార్యక్రంమలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, చలిగంటిశ్రీనివాసరావు, రమణమూర్తి, వంగా వెంకట్, లక్ష్మీ పతి, వీరస్వామి, కందుల భాస్కర్, గెద్దాడ నగేష్, కరీష రత్నకుమా రి, గడ్డంరాజయ్య, లక్ష్మీ, భాగం మాధవరావు, దారా శ్రీనివా స్, మాజీ వార్డు కౌన్సిలర్లు ఈసఫ్, మాచర్ల శ్రీనివాస్, చారీ, విజయ్,మునిగడప పద్మ, ధర్మరాజు, నెరేళ్ల రమేష్, బత్తుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.