06-12-2025 12:12:56 AM
శర్వా హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. తొలిచిత్రం ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఈ మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
ఇంతకుముందు శర్వా నటించిన ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి చిత్రాలు సంక్రాంతి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే నమ్మకంతో మరో సినిమాతో పండుగకు వస్తున్నాడీ చార్మింగ్ స్టార్. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్; సినిమాటోగ్రఫీని జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్; డైలాగ్స్: నందు సవిరిగాన; కథ: భాను భోగవరపు; నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.