05-12-2025 08:06:32 AM
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన అఖండ-2 సినిమా విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతో షెడ్యూల్ ప్రకారం సినిమా విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం అఖండ-2 సినిమా ఇవాళ విడుదల కావాల్సిఉంది. అంఖండ-2 సినిమా(Akhanda 2 release date postponed) విడుదల వాయిదా వేయడం బాధకరమని నిర్మాతలు తెలిపారు. సమస్య పరిష్కారానికి సాధ్యమైనంత మేరకు ప్రయత్నించామని పేర్కొన్నారు. ప్రేక్షకులు, అభిమానులను నిరాశపరిచినందుకు అఖండ-2 నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. త్వరలో అంఖండ-2 సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తామని 14 రీల్స్ సంస్థ వెల్లడించింది.