calender_icon.png 7 December, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోగా రామ్‌గోపాల్‌వర్మ

06-12-2025 12:15:04 AM

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. ఇప్పుడాయన మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. నిజ జీవితంలో షో మ్యాన్ అయిన ఆర్జీవీ ‘షో మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారనుకుంటే పొరపడినట్టే! ఈ సినిమాలో ఆర్జీవీనే హీరో. రామ్‌గోపాల్‌వర్మ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాకు ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనేది ట్యాగ్‌లైన్.

నూతన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతంలో రామ్‌గోపాల్‌వర్మతో ఐస్‌క్రీమ్, ఐస్‌క్రీమ్2 సినిమాలు చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు సుమన్ మరోసారి ఈ చిత్రంలోనూ తన విలనిజాన్ని చూపించనున్నారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. 2026 సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసి, అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.