10-02-2026 12:00:00 AM
క్లాస్‌రూమ్‌లో విద్యార్థినిని షూట్ చేసిన తోటి విద్యార్థి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఉన్నట్టుండి ఓ విద్యార్థి తరగతి గదిలోకి వచ్చాడు. గన్ను తీశాడు. విద్యార్థినిపై పాయింట్ బ్లాంక్‌లో కాల్చాడు. అంతే.. విద్యార్థిని స్పాట్ డెడ్. తర్వా త నిందితుడూ కాల్చుకున్నాడు. ఇదంతా మూడు సెకన్లలోనే పూర్తయింది. పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలోని ఓ లా కాలేజీలో ప్రదీప్‌రాజ్ లాఫస్టియర్ చదువుతున్నాడు. ఇదే క్లాస్‌లో సందీప్ కౌర్ అనే విద్యార్థిని కూడా చదువుతోంది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ, ప్రదీప్ సోమవా రం ఉదయం 9:15 గంటలకు తరగతి గదిలోకి వచ్చాడు.
సందీప్ కౌర్‌తో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో కౌర్ బయటకు వెళ్తుండగా ప్రదీప్ ఆమెను వెంబడిం చాడు. ప్రదీప్ బ్యాగ్ నుంచి పిస్టల్ తీసి కాల్చేశాడు. కౌర్ అక్కడికక్కడే మరణించింది. తర్వాత ప్రదీప్ కూడా కాల్చుకున్నాడు. ప్రస్తు తం ప్రదీప్‌రాజ్ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మొత్తం దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.