15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

29న కోట్ల విజయ భాస్కర్ స్టేడియంలో సంగీత నృత్య మహోత్సవం

28-06-2025 12:38 AM

ఖైరతాబాద్; జూన్ 27 (విజయ క్రాంతి) : హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ తుంబుర సంగీతాలయం సం యుక్త ఆధ్వర్యంలో ఈనెల 29న యూసఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మహోన్నత సంగీత నృత్య మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ సేవా సమితి అధ్యక్షులు డివీ రాధాకృష్ణ తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి నిర్మల తదితరులతో కలిసి ఇందుకు సం బంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

అనంత రం వారు మాట్లాడుతూ...రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స్థాపించి శతబ్దం పూర్తి అయిన సందర్భంగా సుమారు 250 మంది విద్యార్థులతో కుచిపూడి నాట్యం, 150 మందితో గీత పరాయణం, 100 మందితో వీణవాయిద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆశాడ మాసం సం దర్భంగా అమ్మవారి సేవ, పరమ వీర చక్ర గౌరవ వందనం, ద్వి సహస్ర అవదాని మాడుగుల నాగ ఫణిశర్మకి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఘన సన్మానం, భారత మాతకి పంచ హరతులు వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయిని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సొసైటీ జాయింట్ సెక్రెటరీ లక్ష్మణ సూరి, కోశాధికారి నాగ సిరొమణి పాటు హిందూ సేవా సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.