అరెరే.. అరెరే.. హృద్యంగా ఉంది
సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. బటర్ఫ్లై మ్యూజిక్ బ్యాన్ప రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, హీరో పూరి ఆకాశ్, సినీ ప్రముఖులు సమీర్, సాగర్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు, మిమిక్రి శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. దియా ఒక వండర్ఫుల్ టాలెంట్. ఈ అరెరే.. అరెరే.. మ్యూజిక్ ఆల్బమ్ చాలా హృద్యంగా ఉంది. ఆమె గాత్రం, నటన రెండింట్లోనూ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కొత్త ప్రతిభలు ముందుకు రావడం తెలుగు సంగీత రంగానికి మంచి సంకేతం. ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. నటి, సింగర్ దియా మాట్లాడుతూ& ఈ ఆల్బమ్ రూపుదిద్దుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన గౌరవనీయ అతిథులందరికీ నేను రుణపడి ఉంటాను. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే నాకు పెద్ద బలం అని అన్నారు. నిర్మాత నూతన్ చెకురి మాట్లాడుతూ& ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్న దియా కోరిక ‘అరెరే.. అరెరే..’ ద్వారా నెరవేరింది. ఆమె ప్రతిభపై నాకు ఉన్న నమ్మకం ఈ ప్రాజెక్ట్ ద్వారా మరింత బలపడింది. మంచి కాన్సెప్ట్తో రూపొందిన ఈ ఆల్బమ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాను అని తెలిపారు. దర్శకుడు క్రాంతి వర్మ మాట్లాడుతూ& ఈ సాంగ్ కోసం మా టీమ్ అంతా ఎంతో శ్రద్ధగా పని చేసింది.
భావోద్వేగాలతో కూడిన అందమైన విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాల న్న లక్ష్యంతో రూపొందించాం. దియా అద్భుతమైన సహకారం అందించారు. ప్రేక్షకులు ఈ ఆల్బమ్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ను దియా గారు చాలా చక్కగా పాడారు. టీమ్లోని ప్రతి ఒక్కరి కృషితో పాట ఇంత బాగా వచ్చింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదలు అని అన్నారు.
ఈ మ్యూజిక్ వీడియోకు క్రాంతి వర్మ దర్శకత్వం వహించగా, కేఅండ్‌ఎం రైటింగ్స్ కథను అందించారు. నిర్మాతగా నూతన్ చెకురి, సంగీతాన్ని శరవణ వాసుదేవన్ సమకూర్చారు. డీఓపీగా చందు ఏజే, ఎడిటర్గా ఆర్.ఎం. విశ్వనాథ్ కుచనపల్లి పనిచేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులను పిక్సెల్పారెట్ పో స్టు నిర్వహించింది. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్తో పాటు స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.




