18 July, 2026 | 2:56 AM

మస్క్ @447 బిలియన్ డాలర్స్

13-12-2024 01:38 AM

వాషింగ్టన్, డిసెంబర్ 12: స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత రికార్డు సృష్టించాడు. 447 బిలియన్ డాలర్ల సంపదను దాటిన మొదటివ్యక్తిగా మస్క్ నిలిచాడు. దీంతో ప్రపంచలోనే అత్యంత కుబేరుడిగా చరిత్రకెక్కి సంపదలో తన మొదటిస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం స్పేస్‌ఎక్స్‌లోని అంతర్గత వాటా విక్రయంతో మస్క్ సంపద దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ 447 బిలియన్ డాలర్లకు  చేరింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ కూడా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరలేదు.

ఇపుడు ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా మస్క్ చరిత్ర సృష్టించారు. మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ ఎక్స్‌ఐ మే నెల నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ 50 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో 1.25 బిలియన్ డాలర్ల విలువలగ షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు,  కంపెనీ ఇన్‌సైడర్ నుంచి కొనుగోలు చేయడంతో స్పేస్‌ఎక్స్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా స్పేస్ ఎక్స్ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా టెస్లా షేర్లు ఆల్ గరిష్ట స్థాయికి 415 డాలర్లకు చేరాయి. 2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది.

అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తరువాత మస్క్ సంపద భారీగా పెరిగింది. మస్క్ సంపద పెరగడానికి టెస్లా, స్పేస్‌ఎక్స్ మాత్రమే కాకుండా ఎక్స్‌ఏఐ కూడా దోహదపడింది. మస్క్ తరువాత జాబితాలో బెప్ బోజోస్( 249 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్(224 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్(198బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్డ్(181బిలియన్ డాలర్లు) ఉన్నారు.