భారీ స్కెచ్ వేసిన ట్రంప్
బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే 25 కంటే ఎక్కువ ఆర్డర్లకు ఆమోదం!
వాషింగ్టన్, డిసెంబర్ 12: అమెరి కా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించగానే.. 25 కంటే ఎ క్కువ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను మొదటి రోజే ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి దఫా నిర్ణయాల తో పోల్చుకుంటే ఈ దఫా మరింత వే గంగా నిర్ణయాలు తీసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారట. 2017 కాలంలో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కొ ద్ది నిర్ణయాలు, చట్టాలే చేశారు. ప్రస్తు త అధ్యక్షుడు జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు 17 ఎగ్జి క్యూటివ్ ఆర్డర్లను ప్రవేశపెట్టారు.
అ ందులో చాలా వరకు గతంలో ట్రంప్ పా లనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం. ‘అమెరి కా ప్రజలు ట్రంప్ మీద ఎంతో నమ్మ కం పెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన వా గ్దానాలను తొలి రోజు నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు’ అని ట్రంప్ అధికార ప్రతినిధి తెలిపారు.
తన పా లనా కాలంలో తీసుకోబోయే నిర్ణయాల గురించి సూటిగా చెప్పేందు కు.. లెజిస్లేటివ్ ద్వారా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేస్తారు. అధ్య క్షుడు జారీ చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు చట్టాలకు లోబడి ఉండాలి. వాటిపై కోర్టులో సవాలు చేయొచ్చు. వాటిక య్యే ఖర్చును కాంగ్రెస్ ఆమోదించాలి.






